- ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను 9 లోపు పరిష్కారించాలి – TGEJAC
TGO NEWS (DEC. 04) : TGEJAC DEMANDS FOR CLEAR ALL EMPLOYEES ISSUES BEFORE 9th DECEMBER. తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల తరఫున టీజేఇఏసీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే హామీ ఇచ్చిన ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. డిసెంబర్ 9 లోపు ఈ సమస్యలు తీర్చాలని కమిటీ డిమాండ్ చేసింది.
5 పెండింగ్ DAలు విడుదల చేయాలి
టీజేఇఏసీ తెలిపిన వివరాల ప్రకారం 2023 జూలై 1 నుంచి 2025 జూలై 1 వరకు మొత్తం 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి.
ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు డీఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని జేఏసీ గుర్తు చేసింది.
డిసెంబర్ 8న జరగనున్న “ప్రజాపాలన” కార్యక్రమానికి ముందుగానే 2023 జూలై 1 నుండి పెండింగ్లో ఉన్న డీఏను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలి
కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసిన ఉద్యోగుల ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియ ఇంకా అమలులోకి రాలేదని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఆలస్యంతో ఉద్యోగులు, విరమణ పొందిన పెన్షనర్లు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
ఎహెచ్ఎస్ను తక్షణమే అమలు చేసి వైద్య సేవలు అందించాలని కోరింది.
పెండింగ్ బిల్లులు చెల్లింపుపై ఆందోళన
ప్రతి నెల 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నప్పటికీ బిల్లుల పెండింగ్ సమస్య తీవ్రమవుతుందనే విషయాన్ని జేఏసీ లేఖలో పేర్కొంది.
ప్రభుత్వం ఇటీవల ₹700 కోట్లు విడుదల చేసినా, నిజానికి నెలకు ₹1,500 కోట్లకంటే ఎక్కువ అవసరం ఉందని పేర్కొంది.
రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా పెండింగ్ మొత్తాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఉపాధ్యాయులకు TET మినహాయింపు ఇవ్వాలి
2010 కు ముందు నియమించబడిన ప్రభుత్వ ఉపాధ్యాయులను TET పరీక్ష నుండి మినహాయించాలని, సంబంధిత తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని జేఏసీ కోరింది.

