ప్రజాస్వామ్య విలువలే టీజీవో పునాది – అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు

  • “పదవి కోసం కోట్లు అనే ఆరోపణలు నిరాధారం – టీజీవో స్పష్టీకరణ”

TGO NEWS (DEC. 16) : TGO PRESIDENT ELURI SRINIVAS RAO ABOUT SECRETARY ELECTIONS. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్రసంఘ ప్రధాన కార్యదర్శి సంఘ నియమాలు, క్రమశిక్షణ సభ్యులు ఎవరైనా ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం పదవికి ఎన్నికయ్యేందుకు “కోట్లు పెట్టైనా కొనేద్దాం” అనే శీర్షికతో వచ్చిన వార్త లో ఎటువంటి వాస్తవం లేదు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సర్వీస్ నుండి రిటైర్ అవుతున్నందున ఏర్పడే ఖాళీని ప్రజాస్వామ్య పద్దతులలో సంఘం నియమించుకుంటుంది.

TGO PRESIDENT ELURI SRINIVAS RAO ABOUT SECRETARY ELECTIONS.

పదవికి ఎవరికి వారు తాము ఎన్నిక కావాలని ఆశ పడటం అత్యంత సహజం, ఆమేరకు వారి వారి ప్రయత్నాలు చేసుకుంటారు, అంతే కానీ కోట్లు ఖర్చు పెట్టుకుని ఎన్నికయ్యే స్థితి ఎట్టిపరిస్థితిలో సంఘంలో లేదు , అటువంటి ప్రయత్నాలు క్రమశిక్షణ కలిగిన తమ సంఘ సభ్యులు ఎవరు చేసే అవకాశము లేదని స్పష్టం చేస్తున్నాము. డబ్బుల ప్రభావం ,పని చేస్తున్న శాఖల ప్రాధాన్యాము ఆధారంగా నియామకాల వైనం టిజిఓ నిఘంటువులో లేదని స్పష్టం చేస్తున్నాము.

భూమి పుత్ర తాత్వికతతో ,స్వరాష్ట్రంలో స్వయంపాలనలో తెలంగాణ ప్రజల ఉద్యోగుల వికాసం జరుగుతుందని ,మేధావులుగా సామాజిక భాద్యతతో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆవిర్భావం జరిగింది. ఆనతి కాలంలో అమోఘ ఉద్యమంను నిర్మించి అధికారులను చరిత్ర నిర్మాణంలో భాగస్వాములు చేసింది . ఉద్యోగుల సంక్షేమంతో పాటు ప్రజల సంక్షేమం ,మన అస్థిత్వ చరిత్ర సంస్కృతి కళల పునరుజ్జీవం కోసం కృషి చేస్తున్న సంఘం . సంఘ నిర్మాణ అధ్యులు అనేక మంది సభ్యులు అరెస్ట్ లను పలు కేసులను నిర్బంధాలను ఎదుర్కొని పోరాడిన ఘనత తన చరిత్రలో నమోదు చేసుకుంది.

ఒక ఉమ్మడి లక్ష్య సాధన,ఆశయ సాకారం కోసం ఐక్యత అనివార్యమైన నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధనలో ముందడుగు వేసి సంఘ నిర్మాణం కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఒక నమూనా నిలిచింది.నిండా 16 ఏళ్లు నిండని సంఘం తన ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను అవలీలగా అధిగమించింది

భారత చరిత్రలో ఒక సామాజిక లక్ష్యం కోసం ఏర్పడి ముందుకు సాగుతున్న విశిష్ట సంఘం టీజీఓ కొనసాగుతున్నదని తెలియవేస్తున్నాము.

ఒక ఉత్కృష్ట సంఘానికి ఒక ఉన్నత స్థానానికి చేరి సేవ చేయాలనే ఆకాంక్ష పలువురికి ఉండడం ప్రగతిశీలతకు నిదర్శనంగా భావిస్తున్నాం..

తమ నిబద్ధత,తమ పూర్వ సేవలు ,తాత్వికత సంఘ ప్రస్థానంలో తమ కృషి ఆధారంగా అత్యధిక సభ్యుల ఆదరణ కోసం కృషి చేయడం ఒక ప్రజాస్వామిక లక్షణంగా భావిస్తున్నాము

తెలంగాణ ఉద్యోగ రంగంలో ,ప్రజల శ్రేయస్సులో ఉజ్వల కాంతి రేఖగా పని చేస్తున్న టీజీఓ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదు.ఉద్యోగుల కిరణంగా భాసిల్లుతున్న సంఘం పై వార్త ప్రచురించే ముందు నిర్ధారించుకోవాలని కోరుతున్నాం.

ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు సామరస్య పూర్వకంగా ప్రజాస్వామికంగా ప్రాతినిధ్యాలు చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.

సంఘ కార్యకలాపాల్లో రాజకీయ పార్టీల జోక్యానికి తావివ్వమని తెలియ తెలియపరుస్తున్నాం. కొన్ని బయటి శక్తులు తమ రాజకీయ అవసరాల కోసం సంఘాన్ని అప్రతిష్ట చేయడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదని , దీనికి అవకాశం ఇవ్వకుండా సంఘ భాద్యులు , సభ్యులు అప్రమత్తం గా ఉండాలని కోరుతున్నాం.

సంఘ నియమాలు, క్రమశిక్షణ సభ్యులు ఎవరైనా ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం.