TGO NEWS (June 27) : Asnala Srinu Special essay on TGLA 475. TGJLA-475 రాష్ట్ర కౌన్సిల్ ప్రతినిధులకు స్వాగతం. తెలంగాణ భౌగోళిక రాజకీయ సాంస్కృతిక చరిత్రను సుసంపన్నం చేసిన ఓరుగల్లు లో టి జి ఓ భవన్ హన్మకొండ లో మీరు నిర్వహిస్తున్న ఈ సమావేశం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను..
Asnala Srinu Special essay on TGLA 475
ప్రతి మనిషికి ఒకే విలువ ,సమాన పనికి సమాన వేతనం అనే సహజ న్యాయ సూత్రాలను ఆవాహన చేసుకున్న వ్యక్తిగా గత పాతిక సంవత్సరాల నుండి మీతో ఉంటూ
మీరు చేపట్టిన ప్రభుత్వ ఇంటర్ విద్య పరిరక్షణలో ,అలాగే మీ ఉద్యోగ భద్రత కోసం చేపట్టిన పలు కార్యక్రమాలలో నా వంతు సహకారం సంఘీభావం తెలియజేస్తు కొనసాగుతున్నాను.
జ్ఞానం ఆచరణ నుండి రూపొందిన ఆందోళన ప్రాతినిధ్య పోరాటాలతో కాంట్రాక్టు అధ్యాపకులకు ఒక జవ జీవాన్ని ఉనికిని భద్రతలను అస్థిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత కొప్పిశెట్టి సురేష్ కు దక్కుతుంది .మీ కోసం పని చేసిన వారిని గుర్తుంచుకోవడం కృతజ్ఞతగా ఉండడం వారి బాటలో నడవడం ఒక గొప్ప మానవ విలువ .
తెలంగాణ వస్తే ఏమీ వస్తుంది ,అందులో మా జీవితాలకు భరోసా ఉంటుందా అనే సందేహాలను నివృత్తి చేసి
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ను పొలిటికల్ జాక్ ఎజెండాలో చేర్చిన ఘనత తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి చెందుతుంది. ఉద్యోగ ఉద్యమాల చరిత్రలో భూమి పుత్ర సిద్ధాంతంతో రాష్ట్ర సాకారంలో ఉద్యోగుల సంక్షేమంలో అనిర్వచనీయమైన పాత్ర టీజీఓ పోషిస్తున్నది. మీ అపరిష్కృత సమస్యల పరిష్కారానికి మేము పెద్దన్న పాత్ర వహిస్తాము.

ఏలూరి శ్రీనన్న సారధ్య టీజీఓ అలుపు ఎరగని పని తీరుతో అధికారుల సర్వీస్ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి అనేక సానుకూల ఫలితాలను ఇస్తుంది.
మీ ఇంక్రిమెంట్ అంశంలో టిజిఓ లు సానుకూలంగా ఉండి మంజూరు చేసారు .దానికి నేనే నిదర్శనం .
విద్యా దళారీలు పెంచి పోషిస్తున్న విచ్ఛిన్నకర శక్తుల చేతులలో బందీ అయిన కొంత మంది ddo లు మీకు అనేక ఆటంకాలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు.ఇప్పటికే మనం ఈ శక్తులను నిర్వీర్యం చేసాము .ఏక స్వామ్యాన్ని తొలగించాము.విద్యా సంస్కృతికి విరుద్ధమైన ఈ అధముల ప్రభావం పూర్తిగా తొలగించే దిశగా అడుగులు వేద్దాము.
ఒక వైపు సమస్యలు ఉన్నా.. మనకు ఉనికిని గౌరవాన్ని ఇస్తున్న ప్రభుత్వ ఇంటర్ విద్యను బలోపేతం చేయడానికి ఆహారహారం పని చేద్దాము.
దేశ నవ నిర్మాణ శిల్పి నెహ్రూ తాత్వికతతో kothari కమిషన్ 10 2 3 సిఫార్స్ మేరకు ఇంటర్ విద్య ఏర్పడింది
మన తెలంగాణ భూమి పుత్రుడు పీవీ విద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1969 లో ఇంటర్ విద్యా ప్రారంభమయ్యింది.వేలాది మంది సృజనకారులను నిపుణులను జనహిత శ్రేష్ఠులను సృష్టించింది.
ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మార్చిన అశోక చక్రవర్తి పులే అంబేద్కర్ మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలి.
మన దగ్గరకు వచ్చే విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి వారిని ప్రోత్సహించాలి.అదనపు పని గంటలను పని రోజులను మనం అందివ్వాలి.సమాజం పట్ల భాద్యతగా ఉండి వివిధ వర్గాల ప్రజల జీవితాలతో మమేకం అవ్వాలి.అంబేద్కర్ గ్రామ్సీ చెప్పిన సమాజానికి తిరిగి చెల్లించు లో TGJLA-475 అధ్యాపకులు ముందుండాలి.
మన పోరాటం కేవలం ఉద్యోగ భద్రత కోసమే కాదు; ప్రభుత్వ విద్య బలోపేతం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, సామాజిక సమానత్వం కోసం. మనం ఐక్యంగా ఉంటే సమస్యలు శాశ్వతం కావు; పరిష్కారాలే శాశ్వతమవుతాయి. మన ఐక్యతే మన బలం, మన క్రమశిక్షణే మన గౌరవం, ప్రభుత్వ విద్య పరిరక్షణే మన పరమ ధర్మం. ప్రతి విద్యార్థి విజయంలో మన బాధ్యత ఉంటుంది. ప్రతి ప్రభుత్వ కళాశాల అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉంటుంది. అదే మన ఉద్యమానికి నిజమైన విజయం.” అధ్యాపకుల ఐక్యత వర్ధిల్లాలి
జై తెలంగాణ-జై టి జి ఓ -టి జి జే యల్ ఏ-475
అస్నాల శ్రీనివాస్
సంపాదకులు టి జి ఓ న్యూస్
కార్యదర్శి
టి జి ఓ సెంట్రల్ అసోసియేషన్

