సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ పండుగ ప్రతీక … TGOs రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి

  • మహిళల రక్షణ, గౌరవం, సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • సమాజంలో సోదరభావం, కుటుంబ బంధాలను మరింత పెంపొందించేందుకు రక్షాబంధన్ స్ఫూర్తినిస్తుంది
  • *కలెక్టరేట్ లో రాఖీ కట్టి, మిఠాయి అందించిన బ్రహ్మకుమారీలకు శుభాకాంక్షలు తెలిపిన TGO రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు.

TGO NEWS – ఖమ్మం (ఆగస్టు 28) : Rakhi festival celebrations by TGOs. సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, పరస్పర నమ్మకానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందనీ TGO రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు.

Rakhi festival celebrations by TGOs

రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో బ్రహ్మకుమారీలు TGO రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారికి రాఖీ కట్టి, మిఠాయి అందించారు. ఈ సందర్భంగా TGO అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలందరికీ మరియు రాష్ట్ర మహిళా ఉద్యోగులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సమాజంలో పరస్పర గౌరవం, సోదరభావం, ఆప్యాయతలను పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

సోదరీమణుల రక్షణ, గౌరవం, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం కుటుంబం, సమాజం మొత్తానికి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తూ, వారి హక్కులు, భద్రత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

రాఖీ పండుగ కేవలం సోదర, సోదరీమణుల అనుబంధానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలో ప్రేమ, సోదరభావం, పరస్పర సహకారం, మానవతా విలువలను మరింత బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాలని,
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రలోని మహిళా మణులు ఉద్యోగులు అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సోదరభావంతో, ఆనందంగా ఉండాలని TGO రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి కొనేదన శ్రీనివాసరావు టీఎన్జీవో మాజీ అధ్యక్షులు పొట్ట పింజర రామయ్య జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ కే దుర్గాప్రసాద్ తెలంగాణ మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అస్లాం మరియు బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏవో చంద్రశేఖర్ కళ్యాణ్ మరియు బ్రహ్మకుమారీలు రాజయోగిని, బికె. అరుణ, బికె.గీత తదితరులు పాల్గొన్నారు.