TGO NEWS (SEP. 06) :TGOs central committee decisions on September 6th 2026. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నేడు కీలక సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
TGOs central committee decisions on September 6th 2026
10 సెప్టెంబర్ న ప్రభుత్వ హామీల అమలు కొరకు “ఛలో హైదరాబాద్”
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తేదీ 06-09-2026 (ఆదివారం) నాడు ఉదయం 10:30 గంటలకు ఆత్మీయ భవన్, గచ్చిబౌలి, హైదరాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి. శ్యామ్ గారు సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గం, తెలంగాణలోని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయం మరియు హైదరాబాద్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సంఘంలోని శాఖల ఫోరమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు మరియు మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పలు ముఖ్యమైన విషయాలపై విస్తృతమైన చర్చ అనంతరం క్రింది తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
పీఆర్సీ నివేదిక
జూన్ 2023లో శ్రీ శివశంకర్, IAS గారికి పీఆర్సీ అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జి.ఓ. జారీ చేశారు. కానీ మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు.
02-05-2026 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారితో జరిగిన భేటీలో 02-06-2026 నాటికి పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమలు చేద్దామని హామీ ఇచ్చారు.
అయితే మూడు నెలలు గడిచినప్పటికీ పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించని కారణంగా 27-08-2026 నాడు ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది.
ప్రభుత్వ హామీల అమలు కోసం 10-09-2026 నాడు లక్షమందితో “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానించడమైనది.
పీఆర్సీ ఫిట్‌మెంట్2వ పీఆర్సీని 42% ఫిట్‌మెంట్‌తో ఇచ్చి వెంటనే అమలు చేయాలని తీర్మానించడమైనది.
పెండింగ్ డీఏలు
పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను క్రింది తేదీల నుండి వెంటనే విడుదల చేయాలని తీర్మానించడమైనది:
- 01-01-2024
- 01-07-2024
- 01-01-2025
- 01-07-2025
- 01-01-2026
- 01-07-2026
⸻
NEHS – New Employees Health Scheme
17-07-2026 నాడు NEHS (New Employees Health Scheme) ను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు లాంఛనంగా ప్రారంభించారు.
కానీ ఇప్పటి వరకు Health Cards Download చేయడంలో, ఆసుపత్రుల యాజమాన్యాలకు EHS/అప్రూవల్ తదితర అంశాల్లో సమస్యలు ఉండటం వల్ల ఉద్యోగులు ఆసుపత్రుల్లో అడ్మిషన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యలన్నింటినీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరించి NEHSను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని తీర్మానించడమైనది.
పెండింగ్ బిల్లులు
ప్రస్తుతం నెలకు ₹1,000 కోట్లు ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు చెల్లిస్తున్నప్పటికీ అది ఏ మాత్రం సరిపోవడం లేదు.
కావున ప్రతి నెల:
- ₹1,000 కోట్లు రెగ్యులర్ ఉద్యోగులకు
- ₹1,000 కోట్లు పెన్షనర్లకు
వెరసి ₹2,000 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తీర్మానించడమైనది.
CPS రద్దు – OPS పునరుద్ధరణ
రాష్ట్రంలో Contributory Pension Scheme (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని తీర్మానించడమైనది.
అలాగే 01-09-2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన ఉద్యోగులకు వెంటనే OPSను అమలు చేయాలని తీర్మానించడమైనది.
ఉద్యోగ సంఘాల గుర్తింపు మరియు హక్కులు
a) గత పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని తీర్మానించడమైనది.
b) ప్రభుత్వం గుర్తించిన ఉద్యోగ సంఘాల బాధ్యులైన Principal Office Bearers (POBs) కు 21 రోజుల Special Casual Leave (SCL) సౌకర్యానికి సంబంధించిన సర్క్యులర్‌ను పునరుద్ధరించాలని తీర్మానించడమైనది.
c) సాధారణ బదిలీలు జరుగుతున్నప్పుడు అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్‌కు ఉన్న మినహాయింపు సర్క్యులర్‌ను వెంటనే పునరుద్ధరించాలని తీర్మానించడమైనది.
జిల్లా మెంబర్‌షిప్
2026 సంవత్సరపు జిల్లా మెంబర్‌షిప్‌ను ఆగస్టు 2026లోగా పూర్తి చేసి కేంద్ర సంఘానికి చెల్లించాలని 26-06-2026 నాటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానించినప్పటికీ, ఇప్పటివరకు ఏ జిల్లా కూడా మెంబర్‌షిప్ పూర్తి చేసి కేంద్ర సంఘానికి సమర్పించలేదు.
కావున దీనిని తొందరగా పూర్తి చేసి కేంద్ర సంఘానికి సమర్పించాలని తీర్మానించడమైనది.
ఫోరమ్స్‌కు ఎన్నికలు
ఎన్నికలు జరపని డిపార్ట్‌మెంట్ ఫోరమ్స్‌కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించడమైనది.

