TGOs Women wing – టీ.జీ.ఓ. మహిళా విభాగం బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన శ్రీ సంజయ్ జాజు

హైదరాబాద్ (Oct. 08) : TGOs bathukamma poster unveiled by CS Sanjay Jaju. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO Association) మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

TGOs bathukamma poster unveiled by CS Sanjay Jaju

ఈ సందర్భంగా టీ.జీ.ఓ. మహిళా విభాగం రూపొందించిన బతుకమ్మ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, IAS గారు సచివాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి (CS) శ్రీ సంజయ్ జాజు, IAS గారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచుల సాంస్కృతిక ఐక్యతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ఒక గొప్ప ప్రతీక అని అన్నారు. అలాగే అందరూ బాగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

టీ.జీ.ఓ. మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. మహిళా ఉద్యోగులలో సాంస్కృతిక చైతన్యం, ఐక్యత, సోదరభావం పెంపొందించడంతో పాటు తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల జీవన విధానంలో అంతర్భాగమని, పూలతో బతుకమ్మను పేర్చి, ప్రకృతిని ఆరాధిస్తూ, సమిష్టిగా పాటలు పాడుతూ నిర్వహించే ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని టీ.జీ.ఓ. మహిళా విభాగం నాయకులు పేర్కొన్నారు.

“బతుకమ్మ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని వారు అన్నారు.
మహిళా ఉద్యోగులందరూ బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీ.జీ.ఓ. మహిళా విభాగం పిలుపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే విధంగా ఈ వేడుకలను ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో నిర్వహించాలని కోరింది.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీ.జీ.ఓ. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బి. శ్యామ్ గారు, మహిళా విభాగం చైర్ పర్సన్ డా జి. దీపా రెడ్డి గారు, కన్వీనర్ జే సుజాత, ట్రెజరర్ శాంతి శ్రీ, కిరణ్మయి, పూనం, అనిత,మమత, చంద్రజ్యోతి, వనజ మరియు వివిధ శాఖలకు చెందిన మహిళా గెజిటెడ్ అధికారులు, ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.