ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల టి జివోస్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

TGO MEWS (DEC.23) : prohibition and excise tgos president and general secretary. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల టి జి వోస్ ఫోరం రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఈ రోజున రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస రావు గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ సత్యనారాయణ గారు, అసోసియేట్ అధ్యక్షులు, శ్యామ్ గార్ల సమక్షంలో టి జి ఓ భవన్, నాంపల్లి లో నిర్వహించడం జరిగింది.

prohibition and excise tgos president and general secretary

తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల టి జి వోస్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా టి. లక్ష్మణ్ గౌడ్ మరియు ఎం.పి.ఆర్ చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.

ఎన్నికల అధికారిగా ఎంబి కృష్ణ యాదవ్ గారు, సహాయ ఎన్నికల అధికారిగా డా.కె. రామారావు గారు మరియు శ్రీనేష్ కుమార్ నోరి, ఎలక్షన్ అబ్జర్వర్ ఈ ఎన్నికలను నిర్వహించారు. ఎక్సైజ్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టిజిఓ అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది. ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేస్తూనే ప్రజలలో భాగమై మన హక్కుల కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎ. సత్య నారాయణ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ శ్యామ్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని అభినందిస్తూ అధికారులందరూ ఐకమత్యంతో కేంద్ర సంఘ ఆదేశాల ప్రకారం కార్యాచరణలో అందరూ పాల్గొనాలని తెలియ జేశారు.

ఇట్టి కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్స్ ఖురేషి, సురేష్ రాథోడ్; టీజీవో రాష్ట్ర కోశాధికారి, శ్రీ ఉపేందర్ రెడ్డి; టిజిఓ రాష్ట్ర సభ్యులు, శ్రీమతి శిరీష,యాదగిరి; నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, శ్రీ కిషన్; శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.

ఎంబి కృష్ణ యాదవ్ ,ఎలక్షన్ ఆఫిసర్, డా. . కె. రామా రావు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్, శ్రీనేష్ కుమార్ నోరి, ఎలక్షన్ అబ్జర్వర్