TGEJAC – సమస్యలు పరిష్కరించండి : ఉద్యోగుల ఐకాస

TGO NEWS (DEC. 11) : TGEJAC LEADERS MET CS RAMAKRISHNA RAO. రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 10న ఉద్యోగుల ఐకాస నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి విన్నవించారు.

TGEJAC LEADERS MET CS RAMAKRISHNA RAO

పెండింగ్‌ డీఏలను, ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని, పెండింగ్‌ బిల్లుల కోసం నెలకు రూ.1500 కోట్లు విడుదల చేయాలని, విద్యా హక్కు చట్టం రాకముందు నియమితులైన టీచర్లకు టెట్‌ అర్హత నుంచి మినహాయించేలా చర్యలు తీసుకోవాలని ఐకాస నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు తదితరులు విన్నవించారు.