టిజివోస్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

TGO NEWS (JAN. 12) : TGOS DAIRY AND CALENDAR 2026 UNVEILED BY CM REVANTH REDDY. తేదీ : 12-01-2026 హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం యొక్క నూతన డైరీ మరియు క్యాలండర్‌ను ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు.

TGOS DAIRY AND CALENDAR 2026 UNVEILED BY CM REVANTH REDDY.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న సానుకూల దృక్పథాన్ని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రతిసమస్య తన దృష్టికి వచ్చిందని, వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పాత బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా 700 కోట్ల రూపాయలను కేటాయిస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఈ నిధుల విడుదలను మరింత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా పెన్షనర్ల సమస్యలను మానవీయ కోణంలో చూస్తామని, వారి బకాయిల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చాలక శక్తులుగా పని చేస్తున్న అధికారులను అభినందించారు.
ప్రభుత్వం ఉద్యోగులు ఒక కుటుంబం లా పని చేస్తున్నామని ,ఈ ఐక్యతను దెబ్బతీసే విచ్ఛిన్నకర శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.తెలంగాణ కుటుంబ పెద్దన్నగా ఆర్ధిక స్థితిని చక్క దిద్దే పనిని చేస్తున్నాని అన్నారు.ప్రజల పట్ల భాద్యత వహించి పని చేయడంలో సంతోషం ఉందన్నారు.ప్రభుత్వంప్రజల పై భారం కోసం పన్నులను పెంచడం చేయడం లేదని అన్నారు.కార్పొరేట్ వ్యాపార వర్గాల ఆస్తులను నిర్మాణాలను సరిగ్గా అంచనా వేసి పన్నులను వసూలు చేస్తే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కరువు భత్యాన్ని ప్రకటించారు.

ఆర్థికపరమైన అంశాలతో సంబంధం లేని సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలన్నా, పారదర్శక పాలన అందాలన్నా అది ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగుల పనితీరు మీదనే ఆధారపడి ఉంటుందని, అందుకే అందరూ అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ముఖ్యమంత్రికి పలు విజ్ఞప్తులు సమర్పించారు. కొత్త పీఆర్సీ (PRC) అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏ (DA) బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సెటిల్మెంట్స్ మరియు నగదు రహిత ఆరోగ్య పథకం (EHS) వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ఇతర పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ గారులతో పాటు రాష్ట్ర కార్యవర్గం మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

సెంట్రల్, జిల్లా మరియు ఫోరం మెంబర్స్ మరియు
ఈ కార్యక్రమంలో శ్రీ ఏలూరి శ్రీనివాస రావు: అధ్యక్షులు, బి.శ్యామ్: ప్రధాన కార్యదర్శి, అసోసియేట్ ప్రెసిడెంట్: ఎం. ఉపేందర్ రెడ్డి, కోశాధికారి: ఎస్, సహదేవ్ మరియు ఉపాధ్యక్షులు- ఏ. జగన్మోహన్ రావు, ఎం. రామకృష్ణ గౌడ్, నరహరి రావు సుంకరి, ప్రోఫ్. జి. మల్లేశం, డా. టి. హరికృష్ణ, డా. జి. దీపా రెడ్డి, సెక్రేటరీస్ : డా. పి. శ్రీరామ్ రెడ్డి , శ్రీమతి. సి హెచ్ శిరీష, జి వి శ్రీనివాస్ గౌడ్, పి శ్రీధర్, ఆర్ . శ్రీనివాస మూర్తి, ఆర్ . కోటాజీ, కోలా రాజేష్ కుమార్, శ్రీమతి సుజాత, ఆర్గనైసింగ్ సెక్రటరీస్ – కె కిరణ్ కుమార్ , సురేష్ వంక దోత, పబ్లిసిటీ సెక్రటరీస్ – అసనాల శ్రీనివాస్, జి. సంతోష్ కుమార్,ఆఫీసు సెక్రటరీస్ – పి. యాదగిరి గౌడ్ , టి వి ప్రసాద్, శ్రీమతి. ఇ వి కిరణ్మయి, సాంస్కృతిక సెక్రటరీస్: ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఎం. శ్రీనివాసులు, మహమ్మద్ మొయినుద్దీన్, క్రీడల మరియు ఆటల సెక్రేటరీస్ : బట్టు గోపి , డా. గంప శ్రీనివాస్, ఇ సి మెంబర్ : శ్రీమతి . జె పూనమ్, డా. ఏ నవీన్ జ్యోతి, బక్క శ్రీనివాస్, కె. శేషు ప్రసాద్, ఎస్. విష్ణు వర్ధన్ పాల్గొన్నారు
మరియు వివిధ జిల్లాల అధ్యక్ష మరియు కార్యదర్శులు: కె శివ కుమార్, డా. ఆర్. రామా రావు, ఎస్. వెంకట పుల్లయ్య, యు మహేష్, ఎ. శ్రీనివాస్ కుమార్, డా. సి హెచ్. ప్రవీణ్ కుమార్, ఏం బి కృష్ణ యాదవ్, అబ్దుల్ ఖాదర్, వెంకటేశ్వర్లు, నిరంజన్ రెడ్డి, కందుకూరి రవిబాబు, రమేష్, శ్రీనివాస్, కార్నెలియస్, విజయలక్ష్మి, సునీల్ కుమార్, రహింఉద్దీన్, శశిధర్ రెడ్డి, దేవేందర్, సాయిరెడ్డి, కాళిచరణ్, అరవింద రెడ్డి, వెంకరేశ్వర్ రావు, వేలాద్రి, రామారావు, శ్రీనిష్ కుమార్, ఒమర్ హుస్సైన్, పొచయ్య, విజయ కుమార్, వరప్రసాద్, రఫీ, ప్రసాద్, వనజ రెడ్డి, సుధకర్, విట్టల్, నాగభూషణం, వినోద్ కుమార్, కురుమూర్తి, సంపత్ రావ్, జీవన కుమార్, రాజశేకర్, సంజీవ, యాదయ్య, యాకూబ్ నాయక్, మొగులప్ప, సతీష్ కుమార్, పి. జి రెడ్డి, రమేష్, కిషన్, అమృత్ కుమార్, రవీందర్, బ్రహ్మనంద రెడ్డి, సమరసేన్, జాబిదుల్లా, వైద్యనాథ్, సంతోష్ కుమార్, నాగరాజ్, అరుణ్ కుమార్, శ్రీనివాస రావ్, జయశ్రీ, భూపాల్ రెడ్డి, పాండు నాయక్, జ్ఞానేశ్వర్, సత్తార్, వరప్రసాద రావు, సురేష్, రామ్ రెడ్డి, ఫణి కుమార్. జగన్మోహన్, శ్రీనివాస్. మరియు ఫోరంల అధ్యక్ష మరియు కార్యదర్శులు: శ్రీనివాస్ రెడ్డి, మమత, మల్లేశం, శ్రీనివాస్, శ్రీనివాస్, విజయ భాస్కర్ రెడ్డి, రవికుమార్, సిద్ధికి, ఉమా శ్రీనివాస్ రావ్, బహకరి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషన్ ప్రసాద్, మధుసూధన చారి, జగన్మోహన్ రావ్, భీమ్ రాజ్, షౌకత్ హుస్సైన్, మల్లికార్జున రెడ్డి, చంద్ర శేఖర్, కార్తీక్, వెంకటేశ్వర్లు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రావ్, వేంకటేశ్వర రావు, శ్రీనివాస్, నాగరాజు, మల్లేశం, చరిత రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్, అబ్దుల్ హయి, ప్రణీత కౌర్, శ్రీనివాస గౌడ్, బ్రీజేష్, రమేష్, విజయ కుమార్, జ్యోతి కుమార్, శదంతజవశ కుమార్, భీమ్ సింఘ్, పద్మలత, సందీప్ కుమార్, విద్యసాగర్, చక్ర పాణి, నరసయ్య, ఆర్. రవీందర్, చక్రపాణి, పవన్ కుమార్, సురేష్, వేంకటేశ్వర రావ్, మధుసూదన్, జాసన్, శ్యామ్ సుందర్, పద్మావతి, మోహన్, శేషు తీరు నరహరి, అక్తర్ పర్వేజ్, శ్రీనివాసులు, సునీల్ రాజ్, నర్సి రెడ్డి, సైదులు, కృష్ణ మోహన్, సబర్ అలీ, పుష్ప, సుజాత, లక్ష్మణ్ గౌడ్, చంద్ర శేఖర్, రామ్ రెడ్డి, శ్రీవాణి, ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్, సదాతయానారాయన, శ్రీనివాస్, ఇంద్రసేన రెడ్డి, శ్రీనివాస్, ఇనేష్, బుచ్చి రెడ్డి, జంగయ్య, పాషా, శ్రీధర్, గోపాల కృష్ణ రావు, జగన్ మోహన్, రాహుల్, రవీందర్ కుమార్, రవీందర్, పురుషోత్తం రెడ్డి, పరశురామ్, రమేష్ బాబు, నాగయ్య, అక్కేశ్వర్ రావు, షబానా పాల్గొన్నారు.