TGO NEWS (DEC. 04) : TGOS PRESIDENT ELURI SRINIVAS RAO ON EMPLOYEES UNITY. తెలంగాణ రాష్ట్రంలోని 30 వేలకు పైగా ఉన్న దేవాలయాల ఉద్యోగులంతా ఒక్కటైతే ప్రభుత్వాలు దిగి వస్తాయని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు.
TGOS PRESIDENT ELURI SRINIVAS RAO ON EMPLOYEES UNITY.
జీవో నంబరు 121కి సవరణ చేస్తూ.. జీవో 577 ప్రకారం అర్చక ఉద్యోగులను జీఐఏ (గ్రాంట్ ఇన్ ఎయిడ్)లో చేర్చాలనే డిమాండ్ తో తెలంగాణ అర్చక-ఉద్యోగుల మలిదశ జీఐఏ సాధన సమితి సమావేశం బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ‘రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అన్ని సంఘాల వారు దైవ దర్శనానికి వస్తారు. వారికి ప్రత్యేక పూజలు చేయించి, అక్షింతలు వేసి, ప్రసాదం ఇస్తూ.. మన సమస్యలతో ఉన్న వినతిపత్రాన్ని కూడా వారి చేతిలో పెట్టండి. మన పోరాటం సమస్యల పరిష్కారం కోసం, జీవన భృతి కోసం.. మన ఉనికే ప్రశ్నార్థకమవుతున్నప్పుడు యుద్ధానికి సిద్ధం కావాల్సిందే’ అని పేర్కొన్నారు.
అర్చక, ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. తమ హక్కులకు భంగం కలిగితే వీధిపోరాటాలకు కూడా వెనుకాడబోమ న్నారు. రవీంద్రాచార్యులు, చింతపట్ల బద్రీనాథాచార్యులు, కాండూరి కృష్ణ మాచార్యులు, ముకుంద్, సాగర్, నాగరాజు, చంద్రశేఖరశర్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
- టిజివోస్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
- విభిన్నమైన ఉద్యోగ సంఘ నేత – ఏనుగుల సత్యనారాయణ (నేడు పదవీ విరమణ).
- ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల టి జివోస్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక
- టిజివోస్ ప్రధాన కార్యదర్శి గా బి. శ్యామ్ ఏకగ్రీవ ఎన్నిక
- ప్రజాస్వామ్య విలువలే టీజీవో పునాది – అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు

