టిజివోస్ ప్రధాన కార్యదర్శి గా బి. శ్యామ్ ఏకగ్రీవ ఎన్నిక

TGO NEWS (DEC. 20) : TGOS STATE GENERAL SECRETARY B SHYAM. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీ. శ్యామ్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ‌ ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎ. సత్యనారాయణ ప్రకటించారు‌.

TGOS STATE GENERAL SECRETARY B SHYAM

మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గర జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారికి, ఏకగ్రీవ తీర్మానంతో సంపూర్ణ అధికారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఇట్టి ప్రాసెసస్ ను ప్రజాస్వామ్య పద్ధతిలో బై లా ప్రకారం పూర్తి చేయుటకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శికి అధికారం ఇవ్వటం జరిగినది.

33 జిల్లాలు రెండు స్పెషల్ బ్రాంచ్ ల అధ్యక్ష కార్యదర్శులతో మరియు సెంట్రల్ కమిటీలో ఉన్న సభ్యులతో అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగినది వ్యక్తిగత అభిప్రయాశేకరణ తీసుకోవటం జరిగింది.

దీనిలో భాగంగా సంఘ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అధ్యక్షునికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి రాష్ట్ర అసోసియేట్ అధ్యకుడు బి. శ్యామ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎంపిక చేయటం జరిగింది.