సమ్మక్క పంపిన వెన్నెల పల్లకి – సీతక్క

  • ఆదివాసీ అస్తిత్వ రథసారథి
    మేడారం అడవిలో వెన్నెల రేఖ
  • తుపాకీ పట్టిన చేత్తోనే చరిత్ర నిర్మాణం
  • నక్సలైట్ ఉద్యమం నుండి నవ మేడారం నిర్మాణం వరకు సీతక్క అద్వితీయ ప్రస్థానం.
  • వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్ (తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం – 9652275560)

Sammakka saralamma jatara developments by seethakka. తూర్పు కేతనమయ్యి ఉదయించనో మహిళా ఋషి – ఎల్లలు ఎరగక నిరంతరం గుర్తుంటుంది నీ కృషి

Sammakka saralamma jatara developments by seethakka.

త్యాగాల కుంభమేళా, ఆదివాసుల అమరుల జాతర, ఆసియా అతి పెద్ద జాతర మేడారం ప్రాంగణం కొత్త రూపును సంతరించుకున్నది.

అఖండ భారతంలో 18 దిక్కులు, 101 రాజ్యాలు ఏర్పాటు చేసిన ఈ దేశ మూలవాసులు ఆదివాసుల చరిత్ర సంస్కృతి జీవ రాతి పుష్పాల రూపంలో కొలువైంది. వెన్నెల పూల ఉద్యాన వనంగా మారింది. దీనికి రూపకర్తగా, చోదక శక్తిగా నవనవన్మేషంగా వెన్నెల కెరటంగా సీతక్క చేసిన కృషి చరిత్ర పుటలలో చిరస్మరణీయమైన అధ్యాయంగా మారుతున్నది.

తూర్పు కేతనమయ్యి ఉదయించనో మహిళా ఋషిఎల్లలు ఎరగక నిరంతరం గుర్తుంటుంది నీ కృషి సీతక్క – అస్నాల శ్రీనివాస్

సమ్మక్క సారలమ్మలను తన కనుపాపలుగా, అనివార్యమైన మరణాన్ని జయించడం నేర్పిన వారుగా జనం కోసం జీవించండి అని తనను నడిపిస్తున్న, దీవించిన వారుగా ఆవాహన చేసుకున్నవారు సీతక్క.

అనసూయ సీతక్క తన బాల్య విద్యార్థి దశ నుండే ఒక చేతితో విప్లవోద్యమాన్ని, మరొక్క చేతితో తన అస్తిత్వ నేపథ్య చరిత్ర అధ్యయనంను, సాహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తన విప్లవ జీవన సహచరుడు, ఆదివాసీ సేనాని అమరుడు కుంజా రాము సహచర్యంలో , నిత్యం ప్రజల మధ్య , ప్రజల నుండి , ప్రజల దగ్గరకు అనే విధానంలో ఆచరణతో ఎప్పటికప్పుడు పరిణితి సాధిస్తూ ఉండేది. కవయిత్రిగా, గాయనిగా, దాడుల ప్రతిదాడులు ఎత్తుగడల వ్యూహకర్తగా పలు రూపాలలో విప్లవోద్యమ విస్తరణకు తన వంతు చురుకైన పాత్ర పోషించింది.

విప్లవోద్యమములో ఉన్నప్పుడే మేడారం సమ్మక్క చరిత్రపై మరింత పరిశోధన చేసారు. నాగరికతకు నడకను నేర్పిన ఆదివాసీ సైన్స్ కు ప్రాచుర్యం కల్పించింది. ప్రజలలో మౌఖికంగా వారసత్వంగా వస్తున్న జానపద గాధలు, పాటలు, సమ్మక్క బంధుగణంలో వివిధ వంశీయుల నుండి సమాచారం సేకరించారు.

విప్లవోద్యమములో ఉన్నప్పుడే మేడారం సమ్మక్క చరిత్రపై మరింత పరిశోధన చేసారు. నాగరికతకు నడకను నేర్పిన ఆదివాసీ సైన్స్ కు ప్రాచుర్యం కల్పించింది సీతక్క అస్నాల శ్రీనివాస్

సీతక్క అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు సమ్మయ్య. కోయలలో 3 నుండి 7 గట్లు ఉంటాయి. 5 వ గట్టు సమ్మక్క వంశంలో పుట్టిన బిడ్డగా, వెదురు, మారేడు దేవత పూజిత వృక్షాలుగా భావించే తన అస్తిత్వ మూలాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు వివరాలు సేకరించారు. ఇతను కోయలలో 4 వ గట్టుకు చెందిన చెందిన వారు , మద్ది బూరుగ మొక్కలను ఆరాధిస్తారు. అలాగే మూడవ గట్టు సారలమ్మ వారు ఇప్ప కస్సు చెట్లను, ఆరో గట్టు వారు బండారి వేప చెట్లను, సిద్ధబోయిన వంశం వారు నెమలి నార, మర్రి చెట్లను ఆరాధిస్తారు.

5 వ గట్టు సమ్మక్క వంశంలో పుట్టిన బిడ్డగా, వెదురు, మారేడు దేవత పూజిత వృక్షాలుగా భావించే తన అస్తిత్వ మూలాలను తెలుసుకున్నారు సీతక్క – అస్నాల శ్రీనివాస్

ప్రజల రక్షణకు ప్రతీకగా ప్రార్థిస్తే అన్యాయం తొలగి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్న పగిడిద్ద రాజు గద్దెను మేడారంలో సమ్మక్క గద్దె సమీపంలో దళ కమాండర్ లుగా ఉన్న విప్లవ జంట సీత రాము ప్రతిష్ట చేయించారు.

మనువాద సంస్కృతి ప్రజలలో ఎక్కువగా ఆమోదం, ప్రాచుర్యం పొందిన వారిని ఏదో పురాణాలు, కల్పితాలు సృష్టించి తమ దేవతలుగా మార్చుకుంటాయి. బుద్ధుడిని దశావతారాల్లో ఒకడిని చేశాయి. షిర్డీ సాయిని కూడా తమ వారిగా ప్రకటించుకున్నాయి. కొన్ని సమయాలలో తమ ఆర్య దేవతల కంటే ఎక్కువగా ప్రజలు వారిని ఆరాధించడం ఎక్కువైనప్పుడు మళ్లీ కట్టు కథలు సృష్టించి తమ దేవతల పరిధిలోకి రారని ప్రచారం చేస్తాయి. ఇదే ప్రక్రియను సంఘ్ పరివార్ శక్తులు ఆదివాసీ బహుజన ప్రజల ఆరాధ్య అమర తల్లులు సమ్మక్క సారక్క పట్ల అనుసరించే ప్రయత్నం చేశాయి. పూజా సంస్కారాలలో బ్రహ్మణీయతను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసారు. బ్రాహ్మణ పూజారులను ప్రవేశపెట్టే ప్రయత్నం చేసారు. అసలు చరిత్రను వక్రీకరించి ఏ మత పరిధిలోకి రాని అదివాసులకు మతము రంగును అద్దె ప్రయత్నం చేసారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టారు. అచ్చమైన ఆదివాసి సాంస్కృతిక విధానాలతో మేడారం జాతర నిర్వహించబడడానికి, వారి విధానాల పరిరక్షణకు ప్రధాన కృషి చేసిన ఘనత నక్సలైట్ పార్టీలకు చెందుతుంది. ఈ ప్రాంత ఉద్యమ దళ కమాండర్ లు గా పని చేసిన సీతక్కరాము జంట ముందు వరుసలో ఉండి పని చేసింది. ఇది ప్రజలందరికీ తెలియాల్సిన ఒక చారిత్రక వాస్తవం.

అచ్చమైన ఆదివాసి సాంస్కృతిక విధానాలతో మేడారం జాతర నిర్వహించబడడానికి, వారి విధానాల పరిరక్షణకు ప్రధాన కృషి చేసిన ఘనత సీతక్కది – అస్నాల శ్రీనివాస్

ఆయిరా గట్లలో ఆది మేడారం, శిలకల గుట్టల చిన్న మేడారం,
కొమ్మ జల్లుమంటే కోటి వేల మంది
ఆకు జల్లు మంటే ఆరు కోట్ల మంది
అల్లో నేరేడు అల్లో
కొమ్మకు కోటి పూలు
పుట్టు బుద్దారం, మెట్టు మేడారం
గుట్టల పుట్టిన గుడి మేడారం,
జారు జారే జంపన్న వాగు
జంపన్న వాగులో ఉయ్యాల లూగు ..

సీతక్క ఇప్పుడు కొనసాగుతున్న పార్లమెంటరీ రాజకీయాలలో రేవంత్ రెడ్డి సారథ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వచ్చిన అవకాశాన్ని అద్వితీయంగా ఉపయోగించుకుంటున్నారు. మనకు పట్టని మన పూర్వీకుల ఆదివాసుల చరిత్రను, వారి జీవన విధానంను వారి సౌందర్య దృష్టి,కళాత్మక దృష్టి కోసం పడిన తపనను ఎల్లకాలం మనల్ని ఉత్తేజితం చేసే, మన హృదయాలను వెలిగించే విధంగా ఒక శిల్పా నిర్మాణ యాగాన్ని ఆరంభించారు. తన అస్తిత్వ మూలాలు, తనను అన్ని వేళలలో ఆత్మ గౌరవంతో, ధిక్కార కేతనంతో, ప్రజల కడగండ్ల ను తీర్చడం కోసం నిత్యం తనను ఆవహించి నడిపించే ఆరాధ్య అరణ్య ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మల చరిత్ర విస్తృత అధ్యయనం కోసం సంస్కృతి, హక్కుల రక్షణ కోసం మారోజు వీరన్న, రాము, సీతక్కలు తుడుము దెబ్బ సంస్థను ఏర్పాటు చేశారు. మైపతి అరుణ్ బృందం నేతృత్వంలోని పరిశోధన బృందం మద్య భారత ఆదివాసీ సంస్కృతిని అధ్యయనం చేసి మరింత ప్రామాణికమైన సమాచారం సేకరించింది. ప్రముఖ స్థపతి ఈమని నాగిరెడ్డి నేతృత్వంలో 450 మంది శిల్పులు కృషితో ప్రాణ ప్రతిష్ట జరిగింది.

ప్రపంచంలోనే ఆదివాసీలు, సంపద సృష్టికర్తలు, ఉత్పాదక శ్రామిక వర్గాలు అత్యధికంగా దర్శించుకునే మహా జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం అభివృద్ధి గత ప్రభుత్వాల కాలంలో అరకొరగానే కొనసాగింది. భారీ స్థాయిలో శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టలేదు. ఇప్పుడు చరిత్ర తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. భవిష్యత్ లో ఏ ఇతర మతాలు ఈ జన జాతరను హైజాక్ చేయకుండా, వారి చిహ్నాలు ఇక్కడ కనపడకుండా, ఆదివాసీ చరిత్రను శాశ్వతతత్వాన్ని సంతరింప చేసింది.

భవిష్యత్ లో ఏ ఇతర మతాలు ఈ జన జాతరను హైజాక్ చేయకుండా, వారి చిహ్నాలు ఇక్కడ కనపడకుండా, ఆదివాసీ చరిత్రను శాశ్వతతత్వాన్ని సంతరింప చేసింది సీతక్క అస్నాల శ్రీనివాస్

తెలంగాణ కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డి చేపట్టిన పలు పోరాట యాత్రలు మేడారం. ఇంద్రవెల్లి నుండి ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రిగా అయ్యాక తన మొక్కులను చెల్లించాడు. ఇంద్రవెల్లి ఘటన ఆదివాసీల పై గత కాంగ్రెస్ హయాంలో జరిగిన దమనకాండకు క్షమాపణ చెప్పారు. అభివృద్ధి పేరుతో విస్తాపనకు గురువతున్న ఆదివాసీ భౌతిక సాంస్కృతిక అభివృద్ధికి నిబద్ధతతో కొనసాగుతుంది అనడంలో జిఓ 49 ఉపసంహరణ ఒక తార్కాణం.

విస్తాపనకు గురువతున్న ఆదివాసీ భౌతిక సాంస్కృతిక అభివృద్ధికి నిబద్ధతతో కొనసాగుతుంది అనడంలో జిఓ 49 ఉపసంహరణ ఒక తార్కాణం.అస్నాల శ్రీనివాస్

తెలంగాణ చరిత్ర పురోగమనంలో తనదైన ముద్ర ఉండేలా తపనతో ఉన్న రేవంత్ రెడ్డితో ఆత్మీయ సోదర అనుబంధంతో, తన ఆదివాసీ అస్తిత్వ కేంద్రం మేడారం వికాసం పై తన ఆకాంక్షలను రూపు దాల్చి సాకారం చెయ్యడంలో కృషి సీతక్క కృషి చేసింది. మేడారం జాతర అభివృద్ధి కోసం గతంలో ఎవ్వరూ చేయని, సాహసించని గొప్ప ముందడుగు వేసేలా, రేవంత్ రెడ్డి సారథ్యంలో విన్నూత్న అధ్యాయాన్ని ఆరంభించింది సీతక్క. 250 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో మేధో సృజనాత్మక పాత్ర పోషించింది. మేడారాన్ని చూస్తే ఆదివాసీల చరిత్ర జ్ఞప్తికి వచ్చేలా నిర్మాణాలు ఏర్పాటు చేసింది. దేవస్థానం ఆధునీకరణ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల పునరుద్ధరణ , సాండ్ స్టోన్ రాయి పై 7000 ఆదివాసీ సాంప్రదాయాల బొమ్మలు , 8 అర్చ్ గేట్ల పై ఆదివాసీ దేవతల గట్టు గోత్రాల వంశాల, పూజా వృక్షాల చిత్రాలను ఏర్పాటు చేసింది. వందలాది శిల్పులు రాత్రి పగలు శ్రమించి అద్వితీయమైన మానవ శాస్త్ర వికాస సౌధాల ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించి చరిత్ర నిర్మాణంలో ఒక గొప్ప ముందడుగుని లిఖితం చేసింది. ప్రకృతిని గాయం చేయకుండా మానవ నాగరికతని నిర్మించిన ఆదివాసీ జ్ఞాన నైపుణ్యాలను తెలిపే చిత్రలిపిలను శిల్పాలుగా మలచింపచేసింది.శఈ కట్టడాలపై సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, కోయల ఇష్ట దైవాలకు ప్రతిరూపంగా భావించే పులి, జింక దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, బండి చక్రాలు, అడ్డ నిలువు గీతలు స్తంభాలపై చెక్కారు. స్వాగత తోరణంలో సమ్మక్క వంశ చరిత్ర , పూజించే దుప్పి, అడవి దున్న, నెమలి ఈకలు,గొట్టు గోత్రాలకు ప్రతి రూపమైన సూర్య చంద్రులు, నెల వంకలను చిత్రించారు. మరో ప్రధాన ద్వారంలో సారక్క సిద్ధబోయిన, కొక్కెర వంశ చరిత్రకు ప్రతీకగా మలిచారు. మేడారం నుండి 600 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాయచూర్ నుండి నాలుగు వేల టన్నుల భారీ నాణ్యమైన శిలలను ఈ నిర్మాణ పనులలో ఉపయోగించారు.

దేవస్థానం ఆధునీకరణ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల పునరుద్ధరణ , సాండ్ స్టోన్ రాయి పై 7000 ఆదివాసీ సాంప్రదాయాల బొమ్మలు , 8 అర్చ్ గేట్ల పై ఆదివాసీ దేవతల గట్టు గోత్రాల వంశాల, పూజా వృక్షాల చిత్రాలను ఏర్పాటు చేసింది. అస్నాల శ్రీనివాస్

18 జనవరి 2026 మేడారం గొప్ప సన్నివేశానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర కేబినెట్, పరిపాలన యంత్రాంగం తల్లుల చెంతకు చేరింది. అది దేవతల, అది అక్షరాల , అది ధ్వనుల , అది చిత్రాల, అలనాటి అపురూప జానపద కళాకృతుల , అందాల బొమ్మల ఆనవాళ్లను ఒక చోట చేర్చి , దక్కన్ పీఠభూమి పలవరింతకు , మధ్య భారత పులకరింతకు , మూలవాసుల మురిపెంకు, తెలంగాణ ఆదివాసీల ఆత్మగీతంకు మేడారంను రాజధానిగా మలచిన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. మానవ శాస్త్ర వికాస జ్ఞాన కేంద్రంగా మారింది.

18 జనవరి 2026 మేడారం గొప్ప సన్నివేశానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర కేబినెట్, పరిపాలన యంత్రాంగం తల్లుల చెంతకు చేరింది. – అస్నాల శ్రీనివాస్

జనవరి 28-31 తేదీల మధ్య మహా జాతర నిర్వహణకు మేడారంను సర్వ సన్నద్ధం అయ్యింది. పచ్చని అడవిలో జరిగే పవిత్ర జాతర పది కాలాల పాటు ఫరీడ విల్లేలా సంకల్పించి శిల్ప నిర్మాణ యాగంతో మేడారంకు కొత్త రూపు సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సి యం రేవంత్ రెడ్డికి, చోదక శక్తి సీతక్కకు అభినందనలు.