Fake TGEJAC పై ప్రత్యేక కథనం

TGO NEWS (MAY 03) : About fake TGEJAC in Telangana. అక్షరం అమ్ముడుపోతుందా.? నిజం రాసే కలం అమ్ముడుపోతే – ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.. గౌరవనీయులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్, సోషల్ మీడియా యాజమాన్యాలకు, ఎడిటర్లకు మరియు సీనియర్ జర్నలిస్టులకు నమస్కారం!విన్నపం : మాకు జర్నలిస్టులపై అపారమైన నమ్మకం ఉన్నది ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రజల సమస్యల పరిష్కరించడంలో ప్రజావాణిని,ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడములో ఎనలేని కృషి చేస్తున్నది. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది మీడియా తీరు ఆందోళన కలిగిస్తోంది. కేవలం కొద్దిమంది వ్యక్తులు, ఎటువంటి గుర్తింపు లేని సంఘాలను పెట్టుకుని, పైసల/పైకం బలంతో మీడియాను మేనేజ్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

About fake TGEJAC in Telangana

తెలంగాణ గడ్డపై 206 కు పైగా ఉద్యోగ సంఘాలు మరియు 15 లక్షల 35 వేల మంది ఉద్యోగుల ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన TGE జేఏసీ (TGEJAC) పోరాటాలు మనందరికీ తెలిసినవే. ప్రభుత్వంతో చర్చలైనా, ఉద్యోగుల హక్కుల పోరాటమైనా ముందుండి నడిపించేది ఈ రిజిస్టర్డ్ జేఏసీ మాత్రమే.

బట్టబయలు చేయాల్సిన వాస్తవాలు:

నకిలీ ప్రాతినిధ్యం:సుమారు 600 మంది తహశీల్దార్లలో కేవలం 50 మంది మద్దతు మాత్రమే ఉన్నవారు,డిప్యూటీ కలెక్టర్ల సంఘంలో 200 మందికి 50 మంది కూడా లేని పావువంతు సభ్యత్వం కూడా లేనివారు…ఒక రాజకీయ పార్టీకి అనుబంధం గా ఉన్న తపస్ దానిలో ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలియదు అటువంటి వారు జేఏసీ పేరు ఎలా వాడుతున్నారు? వారి జేఏసీలో ఏ సంఘాలు ఉన్నాయి? ఏదైనా ఒక్కటైనా గుర్తింపు సంఘం ఉన్నదా? అసలు వారి సంఘం రిజిస్టర్ అయినదా ? వారికి ఆఫీస్ ఉన్నదా వారి వెనక ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? TGEJAC ని ప్రభుత్వం పిలిచిన ప్రతిసారి వారు అటెండ్ అయ్యి ఫోటోలు దిగి ప్రెస్ ని మేనేజ్ చేస్తూ పేపర్లో కవరేజ్ ఇప్పించుకొని ఉద్యోగుల్లో అపోహలు సృష్టిస్తున్నారు.

TGEJAC లోని కొంతమంది కోవర్టులు ఆ సంఘానికి లీకులు ఇవ్వడం వెంటనే వారు లక్షల రూపాయలతో పేషిలని మేనేజ్ చేస్తూ మీడియాని మేనేజ్ చేస్తూ ఉద్యోగ వర్గంలో అపోహలు సృష్టిస్తున్నారు. అసలైన గుర్తింపు — మాది! పూర్తి రిజిస్టర్డ్ సంస్థ రిజిస్ట్రీ అనుమతి పొందిన లోగో స్పష్టమైన Bylaws & రాజ్యాంగం ఉన్న జేఏసీ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన 9 సంఘాలు మరియు 206 సంఘాలు ఉన్న నికార్సైన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం ఇస్తున్న TGEJAC* మాది.

పైసల పరపతి – వార్తల విక్రయం:

కొందరు వ్యక్తులు కేవలం డబ్బు బలంతో ప్రెస్ నోట్ ల కోసం లక్షల రూపాయలు వెదజల్లుతూ కొన్ని మీడియా సంస్థలను మేనేజ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియా, ప్రలోభాలకు లొంగి డూప్లికేట్ సంఘాలను ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం?వార్తలు కొనుగోలు చేస్తున్నారు!వేల రూపాయలు చెల్లించి ప్రెస్‌నోట్ లు వేయిస్తున్నారు. విజిలెన్స్ ఏది?అవినీతిపై కలం పట్టే మీడియా…తన సొంత గడపలో జరుగుతున్న “పెయిడ్ న్యూస్”ని* ఎందుకు చూడలేకపోతోంది అని తీవ్రమైన వేదనతో మా ఉద్యోగుల మనోవేదనని మీకు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియా అంటే మాకు అమితమైన గౌరవం ఉన్నది కానీ కొంతమంది చేసే తప్పులను ఎత్తిచూపటమే ప్రజాస్వామ్యవాదిగా నా కర్తవ్యం గా భావించి నా ఆవేదనను మీతో పంచుకుంటున్నాను.

ప్రభుత్వానికి మరియు అధికారులకు విన్నపం:

డూప్లికేట్ జేఏసీలను ప్రోత్సహించడం వల్ల అసలైన ఉద్యోగ సమస్యలు పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి, ఇప్పుడు మళ్ళీ అదే పేరుతో వస్తున్న వారిని వినోదపరుస్తున్నారు. పాత ప్రభుత్వానికి ఆ నాడు ఉన్న ఉద్యోగ సంఘ నాయకులు ఎంత కొమ్ముకాచినప్పటికీ ఉద్యోగుల ఎడల కక్షపూరితంగా వ్యవహరించి, కనీస మర్యాద ఇవ్వని వారిని తెలంగాణ ఉద్యోగ వర్గం కర్రు కాల్చి వాత పెట్టింది, ఇప్పుడు తిరిగి వారు అదే డ్రామాలాడుతున్నారు! వారి వెనక ఉద్యోగులు ఎవరూ లేరు కేవలం డబ్బుతో అన్ని మ్యానేజ్ చేయవచ్చు అనే భ్రమల్లో బతుకుతున్నారు. అటువంటి వారిని ప్రభుత్వం పట్టించుకోవడాన్ని ఉద్యోగ సంఘాల మధ్య ఉద్యోగుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నంగా ఉద్యోగులు భావిస్తున్నారు. గుర్తింపు లేని, ప్రలోభాల ద్వారా మాత్రమే జీవించే నకిలీ సంఘాలను ప్రోత్సహించడం — రేపు ఉద్యోగ వ్యవస్థకే మహా ముప్పు! టీజీఈ జెఎసి నాయకులు కూడా ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు లచ్చిరెడ్డి జేఏసీని ప్రభుత్వం ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది, ప్రభుత్వ అధికారులు వారిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అని ఎందుకు ప్రశ్నించడం లేదు? TGEJAC లో ఉన్న కోవర్టులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒక చిన్న సంఘం ప్రెస్ ను, పేషీలను, అధికారులను మేనేజ్ చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సంఘం TGEJAC ఎందుకు మేనేజ్ చేయలేక పోతుంది? 206 సంఘాలతో 15 లక్షల మంది ఉద్యోగులతో ఉన్న పెద్ద సంఘం ఎటువంటి సంఘాలు లేని కేవలం డబ్బులతో షో పుట్ అప్ చేస్తున్న అటువంటి సంఘాలను పిలిస్తే మేము చర్చలకు హాజరు కామని *TGEJAC* నాయకులు ప్రభుత్వం తో ఎందుకు చెప్పలేకపోతున్నారో మీరు ఎంతైనా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదిఅని తెలియజేస్తున్నాను.

నిజాయితీని గుర్తించండి! అక్షర గౌరవాన్ని కాపాడండి!తప్పుగా భావించవద్దు బాధ పెడితే మన్నించండి ఒక సాధారణ ఉద్యోగి అరణ్య రోదన గా భావించాలని సవినయంగా మా ఉద్యోగుల మనోవేదనని అక్షర మేధావులు మరియు ఉద్యోగ సంఘ నాయకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను!

— అసలైన TGEJAC తరపున ఒక ప్రాథమిక సభ్యుని ఆవేదన