TGO NEWS (MAY 29) :TG Govt supports employees says TGEJAC. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కీలక అడుగు వేసిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) పేర్కొంది. ఉద్యోగులకు బకాయిగా ఉన్న రూ.6000 కోట్ల చెల్లింపులో భాగంగా తొలి విడతగా రూ.2000 కోట్లను విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మరియు మంత్రి మండలికి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,మరియు మాకు సహకరించిన అధికారులకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
TG Govt supports employees says TGEJAC
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల వ్యవధిలో బకాయిల చెల్లింపులకు శ్రీకారం చుట్టడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సహకరించిన అధికార యంత్రాంగానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, “మొదటి విడతగా రూ.2000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, మిగిలిన రూ.4000 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తుందనే పూర్తి నమ్మకం మాకు ఉంది. ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోంది” అని పేర్కొన్నారు.
ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ ఉద్యోగ జేఏసీ స్వాగతిస్తోందని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇదే విధమైన చొరవ చూపాలని కోరింది.

